New GST Rates Applicable From Today | Oneindia Telugu

2017-11-15 1,586

The GST rates for over 1,800 goods and services have been revised. It came into effect from midnight. The decision to revise the rates was taken at a recent meeting chaired by Union Finance Minister, Arun Jaitley.

జీఎస్టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గించిన నేపథ్యంలో బుధవారం నుంచి 200లకుపైగా వస్తువులు ఇంతకుముందు కన్నా తక్కువ ధరలకే లభించనున్నాయి. గత శుక్రవారం గౌహతిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జరిగపిన జీఎస్‌టీ మండలి సమావేశంలో జీఎస్టీ తగ్గింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
జీఎస్టీ తగ్గింపు ధరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో 18శాతం నుంచి 5శాతానికి తగ్గించిన జీఎస్టీ రేట్స్ నవంబర్ 15నుంచి అమల్లోకి వస్తుందని ఆరోజే వెల్లడించారు.
కాగా, 228 వస్తువుల్లో దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు(18శాతానికి) నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు.అలాగే జీఎస్‌టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.హోటల్స్‌, రెస్టారెంట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌లో విస్తృత చర్చ జరిగిందని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు.ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్‌, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్‌టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు.